బాలీవుడ్ క్రేజీ ఫ్రాంచైజీలో తమన్నా.. షూటింగ్ స్టార్ట్..!

బాలీవుడ్ క్రేజీ ఫ్రాంచైజీలో తమన్నా.. షూటింగ్ స్టార్ట్..!

Published on Jul 16, 2026 10:56 PM IST

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా లీడ్ రోల్‌లో నటిస్తున్న క్రేజీ హారర్ థ్రిల్లర్ ‘రాగిణి 3’ షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. లండన్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని 2027లో గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. శశాంక ఘోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా, బాలీవుడ్‌లో విజయవంతమైన ‘రాగిణి’ హారర్ ఫ్రాంచైజీకి కొనసాగింపుగా రాబోతోంది.

తమన్నా కెరీర్‌లోనే అత్యంత బోల్డ్ మరియు గ్లామరస్ పాత్రలో ఈ చిత్రంలో కనిపించనుండటం విశేషం. ఈ చిత్రంలో అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. గత కొన్నేళ్లుగా గ్లామర్ డోస్ పెంచుతూ డిజిటల్ స్పేస్‌లోనూ సంచలనం సృష్టిస్తున్న తమన్నా, కేవలం సౌత్ సినిమాలకే పరిమితం కాకుండా హిందీ వెబ్ సిరీస్‌లు, ఓటీటీ ప్రాజెక్ట్‌లతో బాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.

ఇటు తెలుగు, తమిళ భాషల్లో కమర్షియల్ చిత్రాలను బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతోంది. ముఖ్యంగా ‘జైలర్’ సినిమాలోని “కావాలా” వంటి స్పెషల్ సాంగ్స్ దేశవ్యాప్తంగా చార్ట్‌బస్టర్‌గా నిలవడంతో, ఐటెం సాంగ్స్ మరియు స్పెషల్ అప్పియరెన్స్‌లకు తమన్నా ఇప్పుడు ప్రైమ్ ఛాయిస్‌గా మారింది. ఈ క్రేజీ హారర్ ప్రాంచైజీలో తమన్నా గ్లామర్ మరియు నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు