లేటెస్ట్ గా టాలీవుడ్ సినిమా దగ్గర సూపర్ హిట్ అయ్యిన చిత్రమే “లెనిన్”. అఖిల్ అక్కినేని హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ సూపర్ హిట్ సినిమా అఖిల్ కి క్రేజీ కంబ్యాక్ ఇవ్వడమే కాకుండా అక్కినేని ఫ్యాన్స్ అందరినీ మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి తీసుకొచ్చింది.
అయితే ఈ సినిమా విడుదల ముందు వరకు నాన్న అక్కినేని నాగార్జున అఖిల్ ప్రయాణంలో కనిపించారు. లేటెస్ట్ గా పెట్టిన సక్సెస్ మీట్ లో తాను మిస్ అయ్యారు కానీ ఇప్పుడు అక్కినేని ఫ్యాన్స్ కి మరో ఫీస్ట్ దక్కనున్నట్టు తెలుస్తుంది.
లేటెస్ట్ బజ్ ప్రకారం మేకర్స్ అరేంజ్ చేస్తున్న మరో సక్సెస్ ఈవెంట్ లో అక్కినేని వారి మరో హీరో అక్కినేని నాగ చైతన్య ఈసారి తన సోదరుడు కోసం వస్తున్నట్టు తెలుస్తుంది. సో ఇదే కన్ఫర్మ్ అయితే మాత్రం అభిమానులకి మరో ట్రీట్ ఇది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా బ్రహ్మాజీ, శత్రు, శివాజీ, ఈశ్వరి రావు తదితరులు నటించారు.


