ఇండియాలో ‘ఒడిస్సీ’కి భారీ ఓపెనింగ్స్? ర్యాంపేజ్ స్టార్ట్ చేసిన నోలన్ సినిమా!

ఇండియాలో ‘ఒడిస్సీ’కి భారీ ఓపెనింగ్స్? ర్యాంపేజ్ స్టార్ట్ చేసిన నోలన్ సినిమా!

Published on Jul 18, 2026 11:26 AM IST

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆడియెన్స్ మాట్లాడుకుంటున్న అవైటెడ్ చిత్రమే “ది ఒడిస్సీ”. పాపులర్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామా గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో కూడా వచ్చింది. మరి ఈ చిత్రం ఇండియాలో భారీ ఓపెనింగ్స్ అందుకున్నట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి. లేటెస్ట్ పి ఆర్ లెక్కల పరంగా ‘ఒడిస్సీ’కి 23 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసినట్టు తెలుస్తుంది.

ఇది మాత్రం నోలన్ సినిమాకి ఓ మ్యాడ్ ఓపెనింగ్ అని చెప్పాల్సిందే. ఎలాంటి మార్వెల్, అవతార్ సిరీస్ ల క్రేజ్ కాకుండా పూర్తిగా నోలన్ పేరిట ఈ వసూళ్లు వచ్చాయని చెప్పవచ్చు. అంతే కాకుండా ఇండియాలో ఐమ్యాక్స్ వెర్షన్ టికెట్స్ కి మామూలు డిమాండ్ లేదట. ఈ మొత్తం వసూళ్ళలో వీటి ప్రభావం కూడా ఎక్కువ అట. సో మొత్తానికి నోలన్ ర్యాంపేజ్ మొదలైంది అని చెప్పాల్సిందే. ఈ వారాంతంలో నంబర్స్ ఎలా ఉంటాయో చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు