వారణాసి షూట్ పై సాలిడ్ అప్డేట్..!

వారణాసి షూట్ పై సాలిడ్ అప్డేట్..!

Published on Jul 18, 2026 6:00 PM IST

Varanasi

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక భారీ షెడ్యూల్‌ను జరుపుకుంటోంది. వారణాసి పుణ్యక్షేత్రం నేపథ్యంలో వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులతో కూడిన ఒక భారీ ‘అఘోర’ ఎపిసోడ్‌ను ఇక్కడ ప్రత్యేకంగా వేసిన సెట్‌లో చిత్రీకరిస్తున్నారు. సినిమాలోని ప్రధాన ఐమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఇప్పటికే పూర్తి కాగా, మరో 80 రోజుల షూటింగ్‌ను సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది.

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలో ఆమె నటిస్తున్న ‘మందాకిని’ పాత్ర ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ.. ఈ సినిమా వివిధ ఖండాలు, విభిన్న కాలాల నేపథ్యంలో సాగే ఒక అద్భుతమైన సాహసయాత్ర అని, ఇందులో హై-వోల్టేజ్ యాక్షన్ సీన్స్ ఉంటాయని పేర్కొంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మోస్ట్ అవేటెడ్ ఇండియన్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం, 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

తాజా వార్తలు