కిరణ్ అబ్బవరంకి కొత్త ట్యాగ్ ఇచ్చిన మైత్రి నిర్మాత!

కిరణ్ అబ్బవరంకి కొత్త ట్యాగ్ ఇచ్చిన మైత్రి నిర్మాత!

Published on Jul 18, 2026 9:00 PM IST

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ సినిమానే “చెన్నై లవ్ స్టోరీ”. ఒక బ్యూటిఫుల్ రోమ్ కామ్ సినిమాగా గా దర్శకుడు రవి నంబురి తెరకెక్కించిన ఈ సినిమా వచ్చే వారం గ్రాండ్ గా విడుదలకి రాబోతుంది. ఈ గ్యాప్ లో మేకర్స్ నేడు అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ ట్రిపుల్ ఏ లో ట్రైలర్ లాంచ్ గ్రాండ్ గా చేసారు.

అయితే ఈ ఈవెంట్ లో మైత్రి నిర్మాత రవి శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం జరిగింది. నాచురల్ స్టార్ నాని నటన చూసి అంతా తనకి నాచురల్ స్టార్ అని పిలిచారు, అలాగే కిరణ్ అబ్బవరం నటన చూసి అతనికి ‘ఒరిజినల్ స్టార్’ అనే ట్యాగ్ పెట్టాలని అనిపించింది అని తెలిపారు. దీనితో తన కామెంట్స్ మంచి వైరల్ గా మారాయి. మరి ఇదే ట్యాగ్ తో రానున్న చెన్నై లవ్ స్టోరీ సినిమాలో తన పేరు పరిచయం చేస్తారేమో చూడాలి.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు