కల్కి : నేషనల్ లెవెల్ లో సెన్సేషన్.. 2 జాతీయ అవార్డ్స్ తో సత్తా..!

కల్కి : నేషనల్ లెవెల్ లో సెన్సేషన్.. 2 జాతీయ అవార్డ్స్ తో సత్తా..!

Published on Jul 19, 2026 12:00 AM IST

Kalki 2

72వ జాతీయ చలనచిత్ర అవార్డులలో టాలీవుడ్ గ్లోబల్ బ్లాక్‌బస్టర్ ‘కల్కి 2898 AD’ సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ సినిమా, 2024 సంవత్సరానికి గాను అత్యంత ప్రతిష్టాత్మకమైన “ఉత్తమ ప్రజాదరణ పొందిన సంపూర్ణ వినోదాత్మక చిత్రం” అవార్డును సొంతం చేసుకుంది. కేవలం వినోదమే కాకుండా టెక్నికల్ రంగంలోనూ తన సత్తా చాటుతూ “ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్” విభాగంలోనూ మరో జాతీయ అవార్డును గెలుచుకుంది. ఈ రెండు అవార్డులతో కల్కి చిత్రం ఇండియన్ సినిమాలో తన అద్భుతమైన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది.

​దర్శకుడు నాగ్ అశ్విన్ వైవిధ్యభరిత ఆలోచనలకు, వైజయంతీ మూవీస్ అత్యున్నత నిర్మాణ విలువలకి దక్కిన అరుదైన గౌరవం ఇది. భారతీయ పురాణాలను, భవిష్యత్ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో జోడించి, ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఒక సరికొత్త థియేటర్ అనుభూతిని ఈ సినిమా అందించింది. ముఖ్యంగా ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ జిహానీ చౌదరి సృష్టించిన కాశీ నగరం, ఇతర ఫ్యూచరిస్టిక్ విజువల్స్ ప్రేక్షకులను వేరే లోకంలోకి తీసుకెళ్లాయి. ఈ ప్రతిష్టాత్మక విజయం ఈ భారీ ప్రాజెక్ట్ కోసం అహర్నిశలు శ్రమించిన చిత్ర యూనిట్ అందరికీ గర్వకారణంగా నిలిచింది.

ఇక ఈ ఉత్సాహంతో కల్కి మేకర్స్ ఇప్పుడు సీక్వెల్ పై మరింత ఫోకస్ తో వర్క్ చేస్తున్నారు.

తాజా వార్తలు