‘గాడ్ ఆఫ్ వార్’లో కార్తికేయుని గురించి రహస్యాలు !

‘గాడ్ ఆఫ్ వార్’లో కార్తికేయుని గురించి రహస్యాలు !

Published on Jul 19, 2026 10:59 AM IST

ఎన్టీఆర్ హీరోగా రాబోతున్న పాన్-ఇండియా మైథాలజికల్ యాక్షన్ ఎపిక్ ‘గాడ్ ఆఫ్ వార్’. పైగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. దీనికితోడు ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత’ తర్వాత త్రివిక్రమ్ చేస్తున్న సినిమా. కాబట్టి, సహజంగానే ఈ సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి. అన్నిటికీ మించి పురాణాల పై త్రివిక్రమ్ కి ఉన్న పట్టు.. నేటి తరం దర్శకులలో మరొకరికి లేదు. అందుకే కాబోలు.. ఈ సినిమా ప్రకటించిన దగ్గర నుంచే సినిమా పై అనేక రూమర్లు, వివాదాలు చెలరేగాయి.

ముఖ్యంగా ఉత్తరంలో జన్మించి, దక్షిణంలో ఆరాధించబడే దేవుడు” అనే కాన్సెప్ట్‌ చుట్టూ వివాదం జరిగింది. కానీ, పూర్తి కథను మేకర్స్ ఇంకా రహస్యంగానే ఉంచారు. ఈ కథలో కార్తికేయుని గురించి ఎవరికీ తెలియని రహస్యాలు, విషయాలు ఉంటాయని, కార్తికేయుని జన్మ గురించే కాకుండా.. కార్తికేయుడు చేసిన యుద్ధాల గురించి కూడా డిటైల్డ్ గా ఉంటాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుంచి మొదలు కానుంది. కాగా ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం అత్యంత భారీ స్థాయిలో రూపొందుతోంది. ఇక నటీనటులు మరియు సాంకేతిక బృందానికి సంబంధించిన మరిన్ని వివరాలు రాబోయే రోజుల్లో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు