నోలన్ నోట ‘RRR’ మాట.. ‘ఒడిస్సీ’ దర్శకుడు ఏమంటున్నారంటే!

నోలన్ నోట ‘RRR’ మాట.. ‘ఒడిస్సీ’ దర్శకుడు ఏమంటున్నారంటే!

Published on Jul 19, 2026 3:23 PM IST

మన తెలుగు సినిమాని మరో స్థాయిలోకి తీసుకెళ్లిన చిత్రాల్లో గ్లోబల్ దర్శకుడు రాజమౌళి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కలయికలో చేసిన క్రేజీ మల్టీస్టారర్ సినిమా “RRR” (రౌద్రం రణం రుధిరం) కూడా ఒకటి. అయితే గ్లోబల్ లెవెల్లో ఈ సినిమాకి ఇప్పటి వరకు కూడా ప్రశంసలు, ప్రస్తావన ఆగలేదు.

తాజగా మరో హాలీవుడ్ దర్శకుడు నోటి నుంచి RRR కోసం చిన్న మాట రావడం వైరల్ గా మారింది. హాలీవుడ్ లో ఇప్పుడు సెన్సేషన్ సెట్ చేస్తున్న చిత్రం “ది ఒడిస్సీ” దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. భారతీయ నటులు, సినిమాలు ఇంకా గ్లోబల్ సినిమా దగ్గర తక్కువ గుర్తింపు తోనే ఉన్నాయి అనే అంశంపై నోలన్ మాట్లాడారు.

ఇప్పటికీ గ్లోబల్ లెవెల్లో పాత డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలే కొనసాగుతూ ఉండడం మూలాన దేశాల వారీగా సినిమాలు విడిపోతున్నాయని ముఖ్యంగా అమెరికా మార్కెట్‌లోకి విజయవంతంగా వెళితే భారతీయ సినిమా నిర్మాతలు, నటులకు ఎన్నో కొత్త అవకాశాలు వస్తాయని నోలన్ తెలిపారు. ఉదాహరణకు RRR అక్కడ థియేట్రికల్ గా సక్సెస్ అయ్యింది అని చెప్పడం వైరల్ గా మారింది. దీనితో RRR టీం ఈ విషయంలో ఆనందం వ్యక్తం చేస్తూ నోలన్ కి థాంక్స్ చెప్పారు. దీనితో ఈ క్లిప్ వైరల్ గా మారింది.

తాజా వార్తలు