ఓటిటిలో కూడా సమంత టేకోవర్.. సరికొత్త రికార్డ్స్ తో!

ఓటిటిలో కూడా సమంత టేకోవర్.. సరికొత్త రికార్డ్స్ తో!

Published on Jul 19, 2026 8:00 PM IST

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రధాన పాత్రలో దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రమే ‘మా ఇంటి బంగారం’. థియేటర్స్ లో 100 కోట్ల గ్రాస్ కి పైగా రాబట్టిన ఈ సినిమాతో తెలుగు సినిమా హిస్టరీలో మొట్ట మొదటి లేడీ ఓరియెంటెడ్ 100 కోట్ల సినిమా అందించి కొత్త రికార్డు సెట్ చేసింది.

ఇక అక్కడ నుంచి ఇటీవలే ఓటిటిలోకి కూడా ఈ సినిమా వచ్చింది. పాపులర్ స్ట్రీమింగ్ సంస్థ జియో హాట్ స్టార్ సొంతం చేసుకోగా హిందీ మినహా మిగతా భాషల్లో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ చిత్రం ఇక్కడ కూడా టేకోవర్ చేసిందని హాట్ స్టార్ వారు చెబుతున్నారు.

సామ్ ఇక్కడా టేకోవర్ చేసి సరికొత్త రికార్డులతో బెంచ్ మార్క్ సెట్ చేసింది అని హాట్ స్టార్ వారు తెలుపుతున్నారు. దీనితో అటు థియేటర్స్ ఇటు ఓటిటిలో కూడా మా ఇంటి బంగారం తో సమంత దుమ్ము లేపేసింది అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా సమంత నిర్మాణం వహించింది. అలాగే తన భర్త రాజ్ నిడుమోరు స్రిప్ట్ పరంగా తన సహకారం అందించారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు