‘రామాయణ’ లీక్డ్ ట్రైలర్.. ముందే ఎక్కువ అంచనా వేస్తున్నారా?

‘రామాయణ’ లీక్డ్ ట్రైలర్.. ముందే ఎక్కువ అంచనా వేస్తున్నారా?

Published on Jul 20, 2026 12:00 AM IST

ఇప్పుడు బాలీవుడ్ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా రిలీజ్ కి తీసుకొస్తున్న అవైటెడ్ పాన్ వరల్డ్ చిత్రమే “రామాయణ”. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ అలాగే సన్నీ డియోల్ లాంటి అగ్ర తారాగణంతో దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ఈ భారీ సినిమా లేటెస్ట్ గా గ్రాండ్ ట్రైలర్ లాంచ్ జరుపుకుంది. అయితే ఈ లాంచ్ నుంచి ట్రైలర్ విజువల్స్ లీక్ అయ్యి సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి.

అయితే ఈ ట్రైలర్ పై లీక్డ్ విజువల్స్ చూసే చాలా మంది ముందే ఒక అంచనాకి వచ్చేస్తున్నారు. ఆ 144పి క్వాలిటీ చూసే ట్రైలర్ పై ఒక జడ్జిమెంట్ కూడా ఇచ్చేస్తున్నారు. ఇంకా అసలు ట్రైలర్ ఒరిజినల్ వెర్షన్ ఆన్లైన్ లో రాలేదు, సో ఇప్పుడే ఒక అంచనాకి వచ్చేయడం ఏమాత్రం సరికాదు. సో ఆన్లైన్ వెర్షన్ వచ్చే వరకు ఆగి చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి హన్స్ జిమ్మర్, ఏ ఆర్ రెహమాన్ లు సంగీతం అందిస్తోండగా మేకర్స్ ఈ ఏడాది దీపావళి కానుకగా సినిమాని రిలీజ్ కి తీసుకొస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు