‘జననాయగన్’కి భారీ బుకింగ్ లు.. ఏకంగా 2.36 లక్షల టిక్కెట్ల విక్రయం !

‘జననాయగన్’కి భారీ బుకింగ్ లు.. ఏకంగా 2.36 లక్షల టిక్కెట్ల విక్రయం !

Published on Jul 20, 2026 11:16 AM IST

Jana Nayagan

తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ నటించిన ‘జననాయగన్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో వివిధ భాషల్లో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. పైగా రిలీజ్ కి మరో మూడు రోజులు మాత్రమే ఉన్నాయి. కాగా నిన్న పూర్తిస్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. కేవలం బుక్ మై షోలోనే గత 24 గంటల్లో 2,36,000కు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి, ఈ చిత్రంపై ఉన్న భారీ అంచనాలకు ఇదే నిదర్శనం. బుకింగ్స్ వేగం పుంజుకుంటుండటంతో, థియేటర్ల వద్ద ఈ చిత్రం సృష్టించబోయే సంచలన విజయానికి ఇది కేవలం ఆరంభం మాత్రమే అనుకోవాలి.

మొత్తానికి ఈ చిత్రం అనేక వాయిదాలు మరియు కంటెంట్ లీక్ సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ, భారీ ఓపెనింగ్స్ తెచ్చుకునేలా ఉంది. దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కించిన ఈ సినిమా విజయ్ సీఎం అయ్యాక థియేటర్స్ లో ఎట్టకేలకి గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా కే వి ఎన్ ప్రొడక్షన్స్ నిర్మాణం వహించారు. ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుండగా, బాబీ డియోల్ ప్రధాన ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు