టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఎస్‌ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. భారీ అడ్వెంచరస్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం 2027 ఏప్రిల్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. అయితే, ‘వారణాసి’ పూర్తయిన వెంటనే మహేష్ బాబు తన నెక్స్ట్ చిత్రం ఎవరితో చేస్తున్నాడనే విషయంపై సోషల్ మీడియాలో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది.
సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో మహేష్ మరోసారి జతకట్టనున్నాడని వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘సరిలేరు నీకెవ్వరు’ అనే బ్లాక్‌బస్టర్ హిట్ వచ్చింది. ఇక త్వరగా సినిమాలు తీసే అనిల్ రావిపూడితో ఓ సినిమాను వీలైనంత స్పీడ్‌గా తీయాలని మహేష్ భావిస్తున్నాడని.. అందుకే వీరి కాంబో సెట్ కాబోతోందనే వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది.
కాగా ఈ ప్రచారంపై దర్శకుడు అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చాడు. మహేష్ బాబు అంటే తనకు ఎంతో గౌరవం అని.. తనతో ఆయన ఎప్పుడూ ప్రేమగా ఉంటాడని అనిల్ తెలిపాడు. కానీ, తమ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతుందనే వార్తల్లో నిజం లేదని.. ఇలాంటి తప్పుడు వార్తలను ఫ్యాన్స్ నమ్మవద్దని ఆయన కోరాడు. దీంతో ఈ పుకార్లు చెక్ పడింది.
Superstar @UrstrulyMahesh garu has always been a dear person to me. ❤️
I have immense love and respect for him, always. 🙏🏻
Whatever news is currently circulating is completely false and untrue. Please don’t believe or spread such rumours. https://t.co/VrSEJOF9yI
— Anil Ravipudi (@AnilRavipudi) August 25, 2026


