చాలా కాలం తెలుగు సినిమా విట్నెస్ చేసిన రియల్ హిట్ చిత్రమే ‘ఇరుముడి’. ఎలాంటి హైక్ లు, ప్రీమియర్స్ లేకుండా ప్లాన్ చేసి మంచి పాజిటివ్ బజ్ తో థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం మాస్ మహారాజ రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక డే 1 నుంచే ఈ సినిమా విషయంలో ప్రశంసలు ఆగలేదు.
సినీ ప్రముఖులు అంతా ఇరుముడి విషయంలో ఆనందం వ్యక్తం చేయగా లేటెస్ట్ గా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కూడా ఈ లిస్ట్ లో చేరింది. ఇరుముడి సినిమా తనకి ఎమోషనల్ గా ఎంతో కనెక్ట్ అయినట్టు ఆమె చెప్పింది. ఈ సినిమాలో చూపించినట్టుగా ఒక చిన్న ఊరి జీవనం నుంచి వచ్చిన తాను తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసేలా సినిమా చేసిందని ఆమె తెలిపింది.
అంతే కాకుండా ఈ చిత్రం ఎంతోమంది చెప్పుకోలేని మాటల్ని చెప్పింది అని మరింత ఎమోషనల్ అయ్యింది. ఇక హీరో రవితేజ సర్ ఇంతమంచి సక్సెస్ అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, బేబీ నక్షత్ర నీ నవ్వు నన్ను నవ్వించింది అని ఆమెకి శుభాకాంక్షలు తెలిపింది. తనతో పాటుగా దర్శకుడు శివ నిర్వాణ ఇంతమంచి విజయాన్ని అందుకోవడానికి అర్హుడు తన విషయంలో కూడా ఎంతో ఆనందంగా ఉందని ఆమె చెప్పుకొచ్చింది. ఇలా ఇరుముడి విషయంలో రష్మిక ఎమోషనల్ పోస్ట్ వైరల్ గా మారింది.
Yesterday I had the opportunity to watch Irumudi.. ❤️
What a beautiful film it is.. ❤️ it hit me in ways I didn’t see coming.. ❤️
Generally when we grow up in small towns something happens to us or something bothers us our first response will be to tell our elders what happened… pic.twitter.com/lyntnD3bm3— Rashmika Mandanna (@iamRashmika) August 25, 2026


