‘బాలయ్య’ సినిమాలో ఐశ్వర్య రాజేశ్ ?

‘బాలయ్య’ సినిమాలో ఐశ్వర్య రాజేశ్ ?

Published on Jul 20, 2026 2:02 PM IST

బాలయ్య బాబు – కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఐతే, ఈ సినిమాలో ఐశ్వర్య రాజేశ్ ఓ పాత్రలో కనిపిస్తోందట. ఐతే, ఆమెది హీరోయిన్ పాత్ర కాదు అని, ఓ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఐశ్వర్య రాజేశ్ నటిస్తోందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ కోసం బాలయ్య బాబు సరికొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. అన్నట్టు ఈ ఫ్లాష్ బ్యాక్ లో బాలయ్య బాబు పాత్ర మాఫియా నేపథ్యంలో ఉంటుందట.

మొత్తానికి ఈ సినిమాలో బాలయ్యను పూర్తిస్థాయి మాస్ అవతార్‌లో చూపించనున్నారు కొరటాల శివ. పైగా ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. స్టోరీ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. దేవర తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో.. కథ పై కొరటాల బాగా కసరత్తులు చేశారట. కాగా సుధాకర్ చెరుకూరి మరియు సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు