టాక్.. కిరణ్ అబ్బవరం కోసం మెగాస్టార్!?

టాక్.. కిరణ్ అబ్బవరం కోసం మెగాస్టార్!?

Published on Jul 21, 2026 7:03 AM IST

ఈ నెలలో విడుదలకి రాబోతున్న అవైటెడ్ తెలుగు చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా దర్శకుడు రవి నంబురి తెరకెక్కించిన లవ్ డ్రామా చిత్రం చెన్నై లవ్ స్టోరీ కూడా ఒకటి. మణిశర్మ పాటలు, టీజర్, ట్రైలర్ లతో మంచి ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

అయితే ఈ సినిమా విడుదలకి ముందు నిర్వహించనున్న గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించి క్రేజీ రూమర్ వినిపిస్తోంది. దీని ప్రకారం మెగాస్టార్ చిరంజీవి ఈ ఈవెంట్ ని గ్రేస్ చేయనున్నట్టు టాక్. మెగాస్టార్ అభిమానులు, పైగా మణిశర్మ మ్యూజిక్ ఈ సినిమాకి అందిస్తుండడం విశేషం కాగా ఇంతమంది స్పెషల్ వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఈ సినిమా ఈవెంట్ కి మెగాస్టార్ హాజరు అవుతారు అనే తెలుస్తోంది. సో దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

తాజా వార్తలు