‘జెంజ్ బ్యాచ్’కి బాలయ్య వాయిస్ ఓవర్ ?

‘జెంజ్ బ్యాచ్’కి బాలయ్య వాయిస్ ఓవర్ ?

Published on Aug 24, 2026 4:03 PM IST

Nandamuri-Balakrishna

విభిన్న చిత్రాల దర్శకుడిగా క్రిష్ జాగర్లమూడికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి దర్శకుడు పూర్తిగా కొత్త నటీనటులతో ‘జెంజ్ బ్యాచ్’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాకి ఇప్పుడు బాలయ్య బాబు సపోర్ట్ దక్కింది. ఈ చిత్రానికి బాలయ్య కథను వివరిస్తూ వాయిస్ ఓవర్ చెబుతున్నారట. మొత్తానికి ఈ సినిమా బాలయ్య వాయిస్ తో మొదలు కానుంది.

కాగా త్వరలో ఈ సినిమా ఫస్ట్ కాపీ రెడీ అవుతుందని.. సినిమా అవుట్ ఫుట్ బాగా వచ్చిందని.. కథే ప్రధాన బలంగా ఉండేలా క్రిష్ స్క్రిప్ట్‌ను రూపొందించారని, సినిమాని కూడా అంతే బలంగా తీశారని తెలుస్తోంది. కథను నమ్మే దర్శకుడిగా క్రిష్ కి మంచి పేరు ఉంది. అందుకే, మరోసారి కొత్త ప్రతిభను పరిచయం చేస్తూ ప్రత్యేకమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరి ఈ ప్రాజెక్ట్‌ తో క్రిష్ హిట్ కొడతారా ? లేక, ఎప్పటిలాగే పేరు మాత్రమే వస్తోందా ? అనేది చూడాలి.

తాజా వార్తలు