హాట్ కేకుల్లా ‘జన నాయగన్’ టికెట్ సేల్స్.. కానీ!

హాట్ కేకుల్లా ‘జన నాయగన్’ టికెట్ సేల్స్.. కానీ!

Published on Jul 21, 2026 8:02 AM IST

Jana Nayagan

కోలీవుడ్ స్టార్ హీరో ఇప్పుడు సీఎం గా మారిన విజయ్ హీరోగా నటించిన తాజా మరియు ఆఖరి చిత్రమే ‘జన నాయగన్’. తమిళ్ తెలుగు సహా హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ఇప్పుడు తీసుకొస్తున్నారు. అయితే ఈ సినిమా బుకింగ్స్ ఆల్రెడీ మూడు భాషల్లో కూడా తెరుచుకున్నాయి.

వీటిలో తమిళ వెర్షన్ లో మాత్రం విజయ్ తన ర్యాంపేజ్ చూపిస్తున్నాడు. కేవలం తమిళ్ వెర్షన్ లోనే ఈ సినిమా హాఫ్ మిలియన్ టికెట్ సేల్స్ జరిగిపోయాయి. ఇదంతా కేవలం ఒక్క బుక్ మై షోలోనే కావడం గమనార్హం. కానీ ఇదంతా బానే ఉంది కానీ మిగతా రెండు వెర్షన్ ల పరిస్థితే డిజప్పాయింటింగ్ గా ఉందని చెప్పాలి.

హిందీ సంగతి అటుంచితే తెలుగు స్టేట్స్ లో చాలా డల్ గా ఈ సినిమాకి బుకింగ్స్ ప్రస్తుతం కొనసాగుతున్నాయి. మరి రిలీజ్ రోజు నాటికి ఏమన్నా లెక్కలు మారుతాయేమో చూడాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా హెచ్ వినోద్ దర్శకత్వం వహించాడు. అలాగే కే వి ఎన్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు