హౌస్‌ఫుల్ షోలతో యశ్ ‘టాక్సిక్’ !

హౌస్‌ఫుల్ షోలతో యశ్ ‘టాక్సిక్’ !

Published on Aug 26, 2026 2:00 PM IST

Toxic

గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ‘కేజీఎఫ్’ స్టార్ యశ్ నటించిన తాజా చిత్రం ‘టాక్సిక్’. ఈ పాన్-ఇండియన్ చిత్రం సంచలనాత్మక ప్రీ-సేల్స్ నమోదు చేసింది. ‘కాంతారా’ను అధిగమించి, కన్నడ చిత్ర చరిత్రలోనే అతిపెద్ద ప్రీ-సేల్స్‌లో ఒకటిగా నిలిచింది. కేవలం అడ్వాన్స్‌ టికెట్స్ రూపంలోనే ఈ చిత్రం రూ. 100 కోట్ల ఓపెనింగ్ వసూళ్లను సాధించినట్లు తెలుస్తోంది. పైగా ఈ రోజు ఈ చిత్రం అన్ని ప్రాంతాలలో, అన్ని భాషలలో అద్భుతమైన ఆక్యుపెన్సీలతో ప్రారంభమైంది.

ముఖ్యంగా, ఒక డబ్బింగ్ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో ఇలా భారీ ఓపెనింగ్స్ రావడం విశేషం. ఎర్లీ మార్నింగ్ షోలు కూడా హౌస్‌ఫుల్ అయ్యాయి. ఇక యశ్ తన నటనకు గానూ ప్రశంసలు అందుకుంటుండగా, ఈ చిత్రం బుక్‌మైషో ప్రీ-సేల్స్ లో ‘ధురందర్ 2’ను కూడా అధిగమించిందని నిర్మాతలు చెబుతున్నారు. ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ఇప్పటికే గంటకు 50 వేల టిక్కెట్లను అమ్ముతోంది,

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు