దర్శకుడు మెహర్ రమేష్ ఇంట తీవ్ర విషాదం!

దర్శకుడు మెహర్ రమేష్ ఇంట తీవ్ర విషాదం!

Published on Jul 22, 2026 7:02 AM IST

మన టాలీవుడ్ దగ్గర స్టైలిష్ టేకింగ్ ఉన్న ప్రముఖ దర్శకుల్లో మెహర్ రమేష్ కూడా ఒకరు. చివరిగా మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ తో పలకరించిన తను ఇప్పుడు పర్శనల్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా మెహర్ రమేష్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. తన సోషల్ మీడియా వేదికగా మెహర్ రమేష్ ఈ విషయాన్ని తెలియజేసి ఆవేదన వ్యక్తం చేశారు. తన సోదరి మెహర్ జ్యోతి సుంకర కన్ను మూసినట్టు తెలుపుతూ పోస్ట్ చేసారు.

‘నా ప్రియమైన చిన్నక్క మెహెర్ జ్యోతి సుంకర ఈ రోజు 9:45 pm కి విజయవాడ లో స్వర్గస్తులైనారు. వైరల్ న్యూమోనియా తో గత 14 రోజులు గా చికిత్స పొందుతూ అనంత లోకాలకి వెళ్లి పోయారు. నా చిన్నప్పటి నుండి తను నా అండ ,ప్రేమ గా నా కూతురి పెళ్లి దగ్గరుండి జరిపించి ,శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల దర్శనం చేసుకుని ఎంతో ఆనంద పడిన మా అక్క ఇప్పుడు ఆ దేవుడి దగ్గరకి ఇంత తొందరగా వెళ్లిపోవడం మా కుటుంబానికి తీరని లోటు.” అంటూ తమ ఇంట జరిగిన తీవ్ర విషాదాన్ని షేర్ చేసుకొని తన బాధ వ్యక్తం చేశారు. ఇది తెలిసిన సినీ ప్రముఖులు మెహర్ రమేష్ కి ధైర్యం చెబుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు