అమెరికాలో ‘M4M’ 60 రోజుల వేడుక.. ‘M4M-2’ సీక్వెల్ ప్రకటన!

అమెరికాలో ‘M4M’ 60 రోజుల వేడుక.. ‘M4M-2’ సీక్వెల్ ప్రకటన!

Published on Jul 22, 2026 8:01 AM IST

అమెరికాలో ప్రదర్శితమవుతున్న సైకాలజికల్ థ్రిల్లర్ చిత్రం ‘M4M (మోటివ్ ఫర్ మర్డర్)’ 60 రోజుల విజయోత్సవాన్ని కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియాలో ఘనంగా నిర్వహించారు. సినీ లౌంజ్‌లో జరిగిన ఈ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు, కమ్యూనిటీ నాయకులు పాల్గొని కేక్ కట్ చేసి చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శక-నిర్మాత మోహన్ వడ్లపట్ల, కథానాయిక జో శర్మ ‘M4M-2’ సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించారు.

ఈ సందర్భంగా మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ.. ప్రేక్షకుల నుంచి లభించిన విశేష ఆదరణే ఈ విజయానికి కారణమని పేర్కొన్నారు. మొదటి భాగాన్ని మించిన ఉత్కంఠభరిత కథనంతో, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ‘M4M-2’ను తెరకెక్కించనున్నట్లు వెల్లడించారు. అనంతరం కథానాయిక జో శర్మ మాట్లాడుతూ.. ‘M4M’ చిత్రానికి వచ్చిన స్పందన పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, సీక్వెల్‌లో మరింత శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు.

మోహన్ వడ్లపట్ల స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, రాహుల్ అడబాల సహ-దర్శకుడిగా, వసంత్ ఇసైపేటై సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ‘M4M-2’ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తామని చిత్ర బృందం స్పష్టం చేసింది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు