షాకింగ్ రెస్పాన్స్ తో మొదలైన విజయ్ చివరి సినిమా.. ముగింపు మ్యాజిక్ చేస్తుందా?

షాకింగ్ రెస్పాన్స్ తో మొదలైన విజయ్ చివరి సినిమా.. ముగింపు మ్యాజిక్ చేస్తుందా?

Published on Jul 23, 2026 5:00 PM IST

Jana Nayagan

కోలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకరైన దళపతి విజయ్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే ‘జన నాయగన్’. విజయ్ కెరీర్ లో ఇదే ఆఖరి సినిమా కాగా దీనికి ఎన్నో ఇబ్బందులు, అవాంతరాలు ఎదురయ్యాయి. ఇలా ఎట్టకేలకి తాను సీఎం అయ్యాక థియేటర్స్ లోకి విడుదలకి వచ్చింది ఈ సినిమా.

తెలుగులో జన నాయకుడు పేరిట వచ్చిన ఈ సినిమాకి షాకింగ్ రెస్పాన్స్ నమోదు అయ్యింది. కోలీవుడ్ లో ఏమో కానీ తెలుగులో అయితే దారుణంగా టాక్ మొదలైంది. భగవంత్ కేసరి సినిమా ఇంకా గొప్పది అని చెప్పేందుకు ఈ సినిమా చేసారా అన్నట్టుగా జన నాయకుడు పై టాక్ మొదలు కాగా ఈ సినిమా ఓవరాల్ ఫలితం ఎలా ఉంటుంది అనేది ఒకింత ఆసక్తిగా మారింది.

విజయ్ గత సినిమా ‘ది గోట్’ కూడా ఈ తరహా నెగిటివ్ టాక్ తోనే మొదలైంది కానీ ఆ చిత్రం 400 కోట్లకి పైగా వసూలు చేసింది. ఇప్పుడు జన నాయగన్ కి కూడా తమిళ్ లో యూనానిమస్ పాజిటివ్ టాక్ కనిపించడం లేదు. సో ఈ సినిమా కూడా ముగింపు వసూళ్ళలో అలానే మ్యాజిక్ చేస్తుందా అనేది చూడాలి.

తాజా వార్తలు