ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ‘ఆలోచన’ టీజర్ విడుదల

ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ‘ఆలోచన’ టీజర్ విడుదల

Published on Jul 25, 2026 2:32 PM IST

Aalochana Movi Teaser

పీఎస్జే ఫిలిమ్స్ కో బ్యానర్‌పై ప్రదీప్ కుమార్, శ్రీనివాస్ గుండబోయిన సంయుక్తంగా నిర్మించిన ‘ఆలోచన’ చిత్రం టీజర్‌ను ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు. సురేందర్ చాచా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జి.వి.నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, రాజన్ హరి, మహర్షి రాఘవ, జయలలిత, బెన్నీ సుధాకర్ తదితర సీనియర్ నటులు ప్రధాన పాత్రలు పోషించారు. వాస్తవ సంఘటనలు, స్నేహం నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా టీజర్ ప్రెజెంటేషన్, సంగీతం ఆకట్టుకునేలా ఉన్నాయని ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ చిత్ర బృందాన్ని అభినందించారు.

ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇదివరకే సీనియర్ నటుడు పద్మశ్రీ మురళీ మోహన్ ఆవిష్కరించారు. తాజా టీజర్ విడుదలతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ముమ్మరం చేసింది. ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి టి. సురేంద్ర రెడ్డి ఛాయాగ్రహణం అందించగా, వియాన్ సంగీతం సమకూర్చారు.

త్వరలోనే పాటలతో పాటు ట్రైలర్‌ను కూడా విడుదల చేసి, సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు