ఆ విషయంలో ‘డిసి’ నిర్మాతపై విమర్శలు.. ఆ ఒక్కటి కూడా చేయాల్సింది..!

ఆ విషయంలో ‘డిసి’ నిర్మాతపై విమర్శలు.. ఆ ఒక్కటి కూడా చేయాల్సింది..!

Published on Sep 13, 2026 12:20 AM IST

తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి దాదాపు రూ. 100 కోట్ల కలెక్షన్లతో సంచలనం సృష్టించిన తమిళ చిత్రం ‘డిసి’ యూనిట్‌కు సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ లగ్జరీ గిఫ్ట్‌లు అందించారు. సినిమా ఘన విజయం సాధించడంతో దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్, హీరో లోకేష్ కనకరాజ్, సంగీత దర్శకుడు అనిరుధ్‌లకు ఆయన బ్రాండ్ న్యూ బీఎమ్‌డబ్ల్యూ కార్లను బహుమతిగా ఇచ్చారు.

అయితే ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన హీరోయిన్ వామిక గబ్బికి ఎలాంటి కానుక ఇవ్వకపోవడంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. వేశ్య పాత్రలో జీవించేసి తన నటనతో సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచిన వామిక ప్రతిభను పక్కన పెట్టడం పట్ల అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

సినిమాలో అంతటి ప్రాధాన్యత ఉన్న పాత్రను అద్భుతంగా పండించిన ఆమెకు కూడా తగిన గుర్తింపు ఇచ్చి, గిఫ్ట్ ప్రెజెంట్ చేయాలని ‘డిసి’ ప్రేమికులు సన్ పిక్చర్స్ నిర్వాహకులను డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు