క్రిష్ కొత్త సినిమా పై లేటెస్ట్ అప్ డేట్ !

క్రిష్ కొత్త సినిమా పై లేటెస్ట్ అప్ డేట్ !

Published on Aug 2, 2026 9:00 AM IST

విభిన్న చిత్రాల దర్శకుడిగా క్రిష్ జాగర్లమూడికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి దర్శకుడు పూర్తిగా కొత్త నటీనటులతో ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకున్న ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు ప్రస్తుతం ప్రసాద్ ల్యాబ్ లో జరుగుతున్నాయి. సినిమా అవుట్ ఫుట్ బాగా వచ్చిందని.. కథే ప్రధాన బలంగా ఉండేలా క్రిష్ స్క్రిప్ట్‌ను రూపొందించారని, సినిమాని కూడా అంతే బలంగా తీశారని తెలుస్తోంది.

పైగా ఈసారి కమర్షియల్ అంశాలతో పాటు భావోద్వేగాలకు కూడా పెద్దపీట వేస్తూ తనదైన శైలిలో క్రిష్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట. నిజానికి స్టార్ హీరోల కంటే కథను నమ్మే దర్శకుడిగా క్రిష్ కి మంచి పేరు ఉంది. అందుకే, మరోసారి కొత్త ప్రతిభను పరిచయం చేస్తూ ప్రత్యేకమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరి ఈ ప్రాజెక్ట్‌ తో క్రిష్ హిట్ కొడతారా ? లేక, ఎప్పటిలాగే పేరు మాత్రమే వస్తోందా ? అనేది చూడాలి.

తాజా వార్తలు