ఓటీటీ పార్ట్నర్ లాక్ చేసుకున్న ‘దొంగ నా కొడుకు’.. షూట్ కి ముందే పాపులర్ సంస్థతో!

ఓటీటీ పార్ట్నర్ లాక్ చేసుకున్న ‘దొంగ నా కొడుకు’.. షూట్ కి ముందే పాపులర్ సంస్థతో!

Published on Aug 4, 2026 9:07 AM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు మౌళి తనుజ్ హీరోగా లిటిల్ హార్ట్స్ తో సాలిడ్ డెబ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత హీరోగా మరో సినిమా కూడా తాను చేయనున్నాడని అది కూడా దిగ్గజ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తో చేయనున్నట్టు టాక్ వచ్చింది. కానీ ఫైనల్ గా ఇదే కలయికలో సినిమా వస్తున్నట్టు ప్రాజెక్ట్ “దొంగ నా కొడుకు” ని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.

అయితే ఈ సినిమా షూట్ ఇంకా పూర్తి కాకుండానే అప్పుడే సాలిడ్ ఓటీటీ డీల్ ని పూర్తి చేసేసుకున్నట్టు తెలుస్తోంది. అది కూడా దిగ్గజ స్ట్రీమింగ్ సంస్ట్ నెట్ ఫ్లిక్స్ కి ఈ సినిమా హక్కులు అమ్ముడు పోయినట్టు తెలుస్తోంది. ఇది మాత్రం మంచి ఆఫర్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమాకి కొత్త దర్శకుడు శ్రీను కంబాల దర్శకత్వం వహిస్తుండగా లిటిల్ హార్ట్స్ సంగీత దర్శకుడు సింజిత్ ఎర్రమల్లినే సంగీతం అందిస్తున్నాడు.

తాజా వార్తలు