ప్రస్తుతం మన తెలుగు సినిమా నుంచి ప్రపంచ ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ సినిమా వారణాసి అనే చెప్పాలి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేస్తున్న ఈ సినిమా ఇండియన్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా తీస్తున్నారు. అయితే ఈ సినిమా హీరో మహేష్ బాబు పుట్టినరోజు ఇప్పుడు రాబోతోంది. దీనితో బిగ్ ట్రీట్ నే అభిమానులు ఆశిస్తున్నారు.
కానీ దీనిపై లేటెస్ట్ రూమర్ ఒకటి వినిపిస్తుంది. మేకర్స్ కేవలం ఒక్క పోస్టర్ లాంటిది మాత్రమే మహేష్ పై విడుదల చేయనున్నట్టు టాక్. అభిమానులు చిన్న పాటి గ్లింప్స్ ని ఆశించారు కానీ మేకర్స్ కేవలం పోస్టర్ తో సరిపెడతారు అని టాక్. సో దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ నటిస్తుండగా ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు. అలాగే కార్తికేయ, కే ఎల్ నారాయణ నిర్మాణం వహిస్తున్నారు.


