‘ఓజి 2’ బ్లాస్ట్ మాత్రం గ్యారెంటీ! సెప్టెంబర్ లోనే ముహూర్తం

‘ఓజి 2’ బ్లాస్ట్ మాత్రం గ్యారెంటీ! సెప్టెంబర్ లోనే ముహూర్తం

Published on Aug 5, 2026 9:00 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించనున్న అవైటెడ్ ప్రీక్వెల్ చిత్రమే ‘ఓజి 2’. తన ఫ్యాన్ దర్శకుడు సుజీత్ తో పవన్ చేయనున్న ఈ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే ఆ మధ్య పవన్ కి చికిత్స జరగక ముందు ఓజి 2 సినిమా వరుస అప్డేట్స్ రావడంతో ఫ్యాన్స్ లో ఆసక్తి తారా స్థాయికి వెళ్ళింది.

పైగా ఆ సమయంలోనే సంగీత దర్శకుడు థమన్ కూడా ఈ సెప్టెంబర్ లో వస్తున్న పవన్ పుట్టినరోజు కానుకగా అప్డేట్ ని కూడా ఖాయం చేసాడు. కానీ లేటెస్ట్ గా సినిమా కొంచెం వెనక్కి వెళ్లొచ్చు అనే రూమర్స్ మొదలైనప్పటికీ ఓజి 2 అప్డేట్ మాత్రం ఉందని థమన్ గ్యారెంటీ ఇచ్చాడు.

వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఓజి 2 చిత్రం అప్డేట్ కోసం సెప్టెంబర్ వరకు ఆగాలని హామీ ఇచ్చాడు. మళ్ళీ గడ్డం పెంచుతున్నా, మీసం తిప్పాలా లేదా అంటూ పవన్ అభిమానులకి ఓజి 2 పై ఓ క్లారిటీ ఇచ్చేసినట్టే అని చెప్పాలి.

తాజా వార్తలు