‘కరికాల’ యోధునిగా సందీప్ కిషన్.. ‘శంబాల’ దర్శకునితో రెండు భాగాల డేట్ లాక్!

‘కరికాల’ యోధునిగా సందీప్ కిషన్.. ‘శంబాల’ దర్శకునితో రెండు భాగాల డేట్ లాక్!

Published on Aug 5, 2026 12:02 PM IST

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ రీసెంట్ గానే సూపర్ సుబ్బు అంటూ ఓటిటిలో పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ తర్వాత తన నుంచి లేటెస్ట్ గా అనౌన్స్ అయ్యిన భారీ చిత్రమే ‘కరికాల’. గత ఏడాది ముగింపులో సాలిడ్ హిట్ ‘శంబాల’ ఇచ్చిన దర్శకుడు యుగంధర్ ముని కాంబినేషన్ లో అనౌన్స్ చేసిన ఈ చిత్రంలో ఒక యోధుని లుక్ లో సందీప్ కిషన్ అదరగొట్టాడు.

అంతే కాకుండా ఈ సినిమాని మేకర్స్ ఆల్రెడీ రెండు భాగాల సినిమాగా కన్ఫర్మ్ చేయడమే కాకుండా రెండు భాగాల రిలీజ్ డేట్ లని కూడా ఇప్పుడు అనౌన్స్ చేయడం విశేషం మొదటి భాగాన్ని వచ్చే ఏడాది జూలై 2న విడుదల చేస్తున్నట్టుగా ఖరారు చేశారు.

అలాగే పార్ట్ 2 కూడా అదే ఏడాది అక్టోబర్ 28న విడుదల చేస్తున్నట్టుగా తెలిపారు. సో ముందే డేట్స్ అనౌన్స్ చేసి తన సినిమా పట్ల ఉన్న నమ్మకాన్ని చూపిస్తున్నారని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా తెలుగు, హిందీ, తమిళ్ లో నిర్మాతలు మహీధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నాభిమోజు తీసుకొస్తున్నారు.

తాజా వార్తలు