లీక్ షాక్: ‘వారణాసి’ నుంచి మళ్ళీ లీక్.. వైరల్ గా మారిన వీడియో!

లీక్ షాక్: ‘వారణాసి’ నుంచి మళ్ళీ లీక్.. వైరల్ గా మారిన వీడియో!

Published on Aug 6, 2026 9:00 AM IST

Varanasi

సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కలయికలో వస్తున్న భారీ చిత్రమే ‘వారణాసి’. ప్రపంచ మార్కెట్ దగ్గర మంచి ఇంపాక్ట్ చూపించడానికి సిద్ధం అవుతున్న ఈ సినిమాకి మొదటి నుంచీ లీక్ టెన్షన్ లు పట్టుకున్నాయి. అయితే వీటి విషయంలో మేకర్స్ ఎంతవరకు సీరియస్ గా ఉన్నారో ఏమో కానీ లేటెస్ట్ గా మాత్రం మరో క్లిప్ సెట్స్ నుంచి లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరోసారి మహేష్ బాబు మీదనే విజువల్స్ లీక్ అయినట్టు తెలుస్తుంది. దీనితో కొందరు అభిమానులు బాగా వర్రీ అవుతున్నారు. సో ఇలాంటి వాటిపై మేకర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి. ఇక ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా ప్రియాంక చోప్రా, పృథ్వీ రాజ్ సుకుమారన్ తదితరులు నటిస్తుండగా ఎస్ ఎస్ కార్తికేయ, కే ఎల్ నారాయణ నిర్మాణం వహిస్తున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు