మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన కెరీర్ హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా ఆసక్తికర ప్రాజెక్ట్ లని ఎంచుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే. అలా తన నుంచి రాబోతున్న మరో కొత్త ప్రయత్నమే కొరియన్ కనకరాజు. దర్శకుడు మేర్లపాక గాంధీ కలయికలో చేసిన ఈ కామెడి హారర్, పైగా కొరియన్ నేపథ్యంలో వస్తుండడంతో మంచి బజ్ నెలకొంది.
ఆరంభం నుంచే ఇంట్రెస్టింగ్ ఫన్ ప్రమోషన్స్ తో ప్లాన్ చేయడం మరింత అట్రాక్షన్ గా మారింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గరకి నేడు పైడ్ ప్రీమియర్స్ తో రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకి ఎంత టార్గెట్ ఉంది అనేది సినీ వర్గాల్లో వినిపిస్తుంది.
కొరియన్ కనకరాజు థియేట్రికల్ గా సుమారు 15 కోట్ల మేర టార్గెట్ తో బరిలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తుంది. సో ఇంత మొత్తం రాబట్టాలి అంటే 30 కోట్లకి పైగానే గ్రాస్ ని అందుకోవాల్సి ఉంది. మరి ఈ సినిమా ఎలా పెర్ఫామ్ చేస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా యూవీ క్రియేషన్స్ నిర్మాణం వహించారు.


