జెట్ స్పీడ్ లో ‘వారణాసి’.. అప్పుడే ఇంత పూర్తి చేసేసారా!?

జెట్ స్పీడ్ లో ‘వారణాసి’.. అప్పుడే ఇంత పూర్తి చేసేసారా!?

Published on Aug 6, 2026 12:00 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రియాంక చోప్రా జోనస్ అలానే పృథ్వీరాజ్ సుకుమారన్ కలయికలో గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘వారణాసి’ కోసం అందరికీ తెలిసిందే. ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమాని పూర్తిగా ఐమ్యాక్స్ వెర్షన్ లో చిత్రీకరిస్తూ ఇండియన్ సినిమా నుంచి రెండో ప్రాజెక్ట్ గా తెస్తున్నారు. అయితే ఈ సినిమా జెట్ స్పీడ్ లో పూర్తవుతున్నట్టు తెలుస్తుంది.

షూటింగ్ అంతా దాదాపు ఇప్పుడు ఏకంగా 85 శాతం చేసేసారట. మిగతా 15 శాతాన్ని ఈ కొన్ని నెలల్లోనే కంప్లీట్ చేసి ఆన్ టైం ఈ భారీ ప్రాజెక్ట్ ని విడుదల చేయాలని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి సాలిడ్ స్కోర్ అందిస్తుండగా ఈ రాజమౌళి తనయుడు కార్తికేయ అలాగే ప్రముఖ వ్యాపారవేత్త కే ఎల్ నారాయణ సంయుక్తంగా భారీ వ్యయంతో నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది ఏప్రిల్ 7న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు