ప్రస్తుతం భారతీయ సినిమా నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ చిత్రాల్లో బాలీవుడ్ వారు తీస్తున్న మహా ఇతిహాస కావ్యం ‘రామాయణ’ కూడా ఒకటి. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాని దర్శకుడు నితీష్ తివారి రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ లాంటి స్టార్స్ తో హాలీవుడ్ ప్రమాణాలతో తెరకెక్కించారు. అయితే ఈ సినిమా తాలూకా ట్రైలర్ విడుదల తర్వాత మేకర్స్ ఇంటర్నేషనల్ వైడ్ గా ఇంగ్లీష్ ట్రైలర్ కూడా విడుదల చేసి మంచి అటెన్షన్ అందుకున్నారు.
దీనితోనే వరల్డ్ వైడ్ సినిమా నవంబర్ 6 రిలీజ్ అని కూడా ప్రకటించారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ప్రపంచ దేశాల్లో సినిమా 6న విడుదల చేస్తే ఇండియాలో మాత్రం రెండు రోజులు ఆలస్యంగా అంటే నవంబర్ 8న విడుదల చేస్తున్నట్టుగా నిర్మాత నమిత్ మల్హోత్రా చెప్పడం ఇప్పుడు వైరల్ గా మారింది. దీనితో ఈ ట్విస్ట్ ఇండియన్ ఆడియెన్స్ లో షాకింగ్ గా మారింది. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ లు సంగీతం అందించగా రకుల్ ప్రీత్ సింగ్, సన్నీ డియోల్, కాజల్ అగర్వాల్ తదితరులు నటించారు.


