సెన్సార్ పనులు ముగించుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’..!

సెన్సార్ పనులు ముగించుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’..!

Published on Aug 8, 2026 5:31 PM IST

తమిళ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఈ మూవీపై అంచనాలు క్రియేట్ అయ్యేలా చేసింది. ఇక ఈ సినిమాను దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాతో సూర్య ఎలాంటి హిట్ అందుకుంటాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే, ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ పనుులు తాజాగా ముగిశాయి ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇందులోని ఫ్యామిలీ అంశాలు ప్రేక్షకులను అలరిస్తాయని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో సూర్య పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని మేకర్స్ కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు.

మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

తాజా వార్తలు