ఓటీటీ వేదిక : ఈటీవీ విన్
ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ : ఆగస్టు 09, 2026
123తెలుగు.కామ్ రేటింగ్: 2.25/5
నటీనటులు : శుభలేఖ సుధాకర్, భ్రమరాంబిక, అన్విత్, రాజశ్రీ నైర్ తదితరులు
దర్శకత్వం : వర ముళ్ళపూడి
నిర్మాతలు : రామ్ విశ్వాస్, రాఘవేంద్ర వర్మ
సంగీతం : సాయి మధుకర్
ఛాయాగ్రహణం : గంగనమోని శేఖర్
కూర్పు : సందీప్ బండ్ల
సంబంధిత లింక్స్ : ట్రైలర్
మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ లో ప్రసారం అవుతున్న వీక్లీ సిరీస్ కథా సుధ నుంచి లేటెస్ట్ గా వచ్చిన కొత్త లఘు చిత్రమే ‘సరికొత్తగా’. సీనియర్ నటుడు శుభలేఖ సుధాకర్ నటించిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
రిటైర్మెంట్ కి దగ్గరగా ఉన్న తన చాదస్తపు మావయ్య రాజారావు (శుభలేఖ సుధాకర్) పెట్టే టార్చర్ తో తన కోడలు ప్రియా (భ్రమరాంబిక) తన భర్త నుంచి విడాకులు తీసుకోవాలని ఫిక్స్ అయ్యి ఆమె తల్లిదండ్రులతో మాట్లాడుతుంది. కానీ రాజారావుకి ఇలా కాదు మరోలా బుద్ధి చెప్పాలని తన అత్త లలిత (రాజశ్రీ నైర్) తో కలిసి ఓ ప్లాన్ చేసి దాన్ని అమలు చేస్తుంది. అక్కడ నుంచి రాజారావులో ఏమన్నా మార్పు వచ్చిందా లేదా? దీని వల్ల ఎదురైన పరిణామాలు ఏంటి అనేది ఇందులో అసలు కథ.
ప్లస్ పాయింట్స్:
సీనియర్ నటుడు శుభలేఖ సుధాకర్ తనకిచ్చిన పాత్రలో అలా ఒదిగిపోయారు అని చెప్పొచ్చు. తన వయసుకి తగ్గ పాత్రలో ఒక కఠినమైన ఇంటి పెద్దగా సాలిడ్ పెర్ఫామెన్స్ తాను కనబరిచారు. అలాగే తన కోడలి పాత్రలో కనిపించిన భ్రమరాంబిక కూడా డీసెంట్ లుక్స్ లో కనిపిస్తూ చాదస్తపు మావయ్య వల్ల ఇక్కట్లు పడే యువ కోడలిగా మెప్పించింది. వీరితో పాటుగా అన్విత్, రాజశ్రీ నైర్ తదితరులు బాగా చేశారు.
మైనస్ పాయింట్స్:
ఇందులో మిస్ ఫైర్ అయ్యిన అంశం ఏమన్నా ఉంది అంటే అది ఫ్లాట్ గా సాగే కథనం అనే చెప్పాలి. ఈ తరహా సబ్జెక్టులు చూసినవే పైగా కనిపించే సన్నివేశాలు ప్రొసీడింగ్స్, రొటీన్ క్లైమాక్స్ వంటివి ఎక్కడా ఎగ్జైట్ చేయవు. సో ఇలా ఫ్లాట్ గా వెళ్ళిపోతుంది. వీటితో శుభలేఖ సుధాకర్ లాంటి నటుల పెర్ఫామెన్స్ లు వేస్ట్ అయ్యాయి. కామెడీ వర్కౌట్ కాలేదు పైగా క్లైమాక్స్ లో ఎమోషనల్ పార్ట్ గా పొంతన లేకుండా కనిపిస్తుంది.
సాంకేతిక వర్గం:
ఈ లఘు చిత్రానికి నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. సంగీతం, కెమెరా వర్క్, ఎడిటింగ్ లు పర్వాలేదు. దర్శకుడు వర ముళ్ళపూడి విషయానికి వస్తే.. కథాసుధలో తన నుంచి గతంలో వచ్చిన లఘు చిత్రాలతో పోలిస్తే ఇది వీక్ గా సాగింది. నెక్స్ట్ ఇంకొంచెం స్ట్రాంగ్ కంటెంట్ తో వస్తే బెటర్.
తీర్పు:
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ ‘సరికొత్తగా’ అనే లఘు చిత్రం అంత ఎంగేజింగ్ గా ఏమి సాగదు. శుభలేఖ సుధాకర్, భ్రమరాంబికల పెర్ఫామెన్స్ లు బాగున్నాయి కానీ కథ, కథనాల్లో బలం లోపించింది. వీటితో ఈ లఘు చిత్రం ఆకట్టుకోదు.
123telugu.com Rating: 2.25/5
Reviewed by 123telugu Team


