సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు టైమ్, ప్లేస్ ఫిక్స్..!

సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు టైమ్, ప్లేస్ ఫిక్స్..!

Published on Aug 10, 2026 5:00 PM IST

తమిళ హీరో సూర్య, యంగ్ బ్యూటీ మమితా బైజు జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ది మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమాతో సూర్య మరోసారి తన అభిమానులకు సాలిడ్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ చిత్రాన్ని తమిళ్‌తో పాటు తెలుగులోనూ గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.

ఈ క్రమంలో ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ గ్రాండ్ తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఆగస్టు 11న సాయంత్రం 5 గంటల నుంచి హైదరాబాద్‌లోని శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఎంతో వైభవంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ భారీ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ వేడుకకు సూర్యతో పాటు చిత్రబృందం హాజరు కానుండటంతో అభిమానులు అత్యంత ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు.

తాజా వార్తలు