సర్జరీ తర్వాత ఎన్టీఆర్ ఫస్ట్ పోస్ట్.. ఫ్యాన్స్, డాక్టర్స్‌కు స్పెషల్ థ్యాంక్స్..!

సర్జరీ తర్వాత ఎన్టీఆర్ ఫస్ట్ పోస్ట్.. ఫ్యాన్స్, డాక్టర్స్‌కు స్పెషల్ థ్యాంక్స్..!

Published on Aug 12, 2026 7:05 PM IST

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ తన ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియా వేదికగా అభిమానులకు శుభవార్త అందించాడు. తనకు జరిగిన సర్జరీ విజయవంతమైందని, ప్రస్తుతం తాను క్షేమంగా ఉన్నానని ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా వెల్లడించాడు. తన ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేసి, ప్రేమను కురిపించిన అభిమానులందరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు.

అలాగే, తనకు మెరుగైన వైద్యం అందించిన కిమ్స్ ఆస్పత్రి వైద్యుల బృందానికి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశాడు. ఈ కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మరియు అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు.

“మీ అందరి మద్దతే నాకు ప్రతిరోజూ కొండంత బలాన్ని ఇస్తుంది.. త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను” అంటూ తారక్ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ఎన్టీఆర్ చేసిన ఈ ట్వీట్‌తో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ, ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా మెసేజ్‌లు పెడుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు