టాలీవుడ్లో మాస్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచిన దర్శకుడు బోయపాటి శ్రీను ప్రస్తుతం కెరీర్లో అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. రొటీన్ మాస్ ఎలివేషన్లు, మోతాదు మించిన యాక్షన్ సీన్ల పట్ల ప్రేక్షకులు అసంతృప్తిగా ఉండటంతో ఆయన చివరి చిత్రం ‘అఖండ 2’ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. బోయపాటిలో మంచి ఎమోషనల్ యాంగిల్ కూడా ఉన్నందున, తన స్టైల్ మార్చుకోవాలని శ్రేయోభిలాషుల నుంచి సూచనలు వచ్చాయట.
ఈ క్రమంలోనే ‘అఖండ 2’ తర్వాత బాలీవుడ్ హీరోతో సినిమా చేయాలని ఆయన భావించి కొన్ని చర్చలు జరిపినప్పటికీ, ఆ ప్రయత్నాలు ఫలించలేదని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లలో బోయపాటికి సినిమాలు చేసే కమిట్మెంట్లు ఉన్నప్పటికీ.. ఆయా సంస్థలు బాలీవుడ్ స్టార్లతో ఏర్పాటు చేసిన సమావేశాలు అనుకూల ఫలితాన్ని ఇవ్వలేదట. అల్లు అర్జున్‌తో సినిమా ఉంటుందనే ప్రచారంలోనూ నిజం లేదని, బన్నీ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఈ కాంబో త్వరలో సాధ్యపడేలా కనిపించడం లేదు. ప్రస్తుతానికి హీరో విషయంలో అయోమయంలో పడిన బోయపాటి మరి ఏ హీరోతో సినిమా సెట్ చేస్తారో చూడాలి.


