మలయాళ సినిమా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే ‘ఐమ్ గేమ్’. దర్శకుడు నహాస్ హిదయత్ తెరకెక్కించిన ఈ క్రేజీ గ్యాంబ్లింగ్ యాక్షన్ థ్రిల్లర్ ని మేకర్స్ ఈ ఆగష్టు 20 రిలీజ్ కి లాక్ చేసిన సంగతి తెలిసిందే. అలా టీజర్, పాటలు కూడా విడుదల చేశారు కానీ రిలీజ్ దగ్గరకి వస్తున్నప్పటికీ ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో సినిమా వాయిదా పడుతున్నట్టుగా టాక్ వినిపించింది.
ఇప్పుడు ఈ టాక్ ని నిజం చేస్తూ దుల్కర్ సల్మాన్ అఫీషియల్ అప్డేట్ ని అందించాడు. ‘ఐమ్ గేమ్’ సినిమా ఆగష్టు 20 నుంచి తప్పుకున్నట్టు ప్రెస్ నోట్ విడుదల చేసి క్షమాపణ చెబుతూ కొత్త డేట్ గా సెప్టెంబర్ 3 నుంచి థియేటర్స్ లో తన థ్రిల్లర్ సందడి చేస్తుంది అని కన్ఫర్మ్ చేశారు.
సినిమాని అన్ని భాషల్లో ఏకకాలంలో విడుదల చేయాలనే ఫిక్స్ అయ్యామని అందుకే డేట్ మార్చడం జరిగింది అని ఈసారి ఎక్స్ పీరియన్స్ అదిరిపోతోంది అని హామీ ఇస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా దుల్కర్ నిర్మాణం వహించారు.
View this post on Instagram


