ఇటీవలే ‘ఓదెల’ ఫ్రాంచైజ్‌తో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు సంపత్ నంది, తన నెక్స్ట్ చిత్రాన్ని ఎస్డిఎల్పి అఫీషియల్ నిర్మాణ సంస్థతో కలసి చేయబోతున్నాడు. వారి కాంబినేషన్లో వస్తున్న ‘ప్రొడక్షన్ నంబర్ 2’ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా నేల పరిమళాన్ని, ఇక్కడి ప్రజల జీవన విధానాన్ని ప్రతిబింబించేలా ఒక బలమైన గ్రామీణ నేపథ్య కథతో రాబోతోందని మేకర్స్ తెలిపారు.
సంపత్ నంది మార్క్ కథనంతో రానున్న ఈ చిత్రంపై సినీ ప్రియుల్లో అప్పుడే ఆసక్తి నెలకొంది. ఇక ఈ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం అగష్టు 14, 2026న మధ్యాహ్నం 1 గంటల నుండి రామానాయుడు స్టూడియోస్‌లో వైభవంగా జరగనుంది. పూజా కార్యక్రమాలతో ఈ సినిమా నిర్మాణ పనులు అధికారికంగా షురూ కానున్నాయి. ఈ మూవీ టైటిల్, నటీనటులు, సాంకేతిక నిపుణులు మరియు ఇతర వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలిపారు.


