అక్కడ మార్కెట్ లో ‘కొరియన్ కనకరాజు’ డామినేషన్!

అక్కడ మార్కెట్ లో ‘కొరియన్ కనకరాజు’ డామినేషన్!

Published on Aug 13, 2026 11:18 AM IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రితికా నాయక్ హీరోయిన్ గా దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించిన సాలిడ్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రమే ‘కొరియన్ కనకరాజు’. చాలా కాలంగా వరుణ్ తేజ్ కోరుకుంటున్న కంబ్యాక్ హిట్ ఈ చిత్రంతో తనకి దక్కింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యాక తెలుగు స్టేట్స్ లోనే కాకుండా యూఎస్ మార్కెట్ లో కూడా మంచి వసూళ్లు ఈ చిత్రానికి దక్కాయి.

ఇలా లేటెస్ట్ గా సినిమా 6 లక్షల డాలర్స్ మార్క్ గ్రాస్ ని నార్త్ అమెరికా దాటి స్ట్రాంగ్ పెర్ఫామెన్స్ చేస్తుంది. దీనితోనే వచ్చి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్న కోలీవుడ్ చిత్రం ‘డిసి’ రెండు వెర్షన్ లో వచ్చినా కూడా అక్కడ ఇంకా హాఫ్ మిలియన్ మార్క్ ని కూడా చేరుకోలేదు. సో ఇలా వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు డామినేషన్ చూపిస్తున్నాడు అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా యూవీ క్రియేషన్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు