సినిమా డిస్ట్రిబ్యూషన్‌లోకి ‘గ్లిట్టర్స్’ అధినేత.. ఒడిశా, నార్త్ ఇండియాలో టాలీవుడ్ చిత్రాల విడుదల!

సినిమా డిస్ట్రిబ్యూషన్‌లోకి ‘గ్లిట్టర్స్’ అధినేత.. ఒడిశా, నార్త్ ఇండియాలో టాలీవుడ్ చిత్రాల విడుదల!

Published on Aug 13, 2026 8:00 AM IST

గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమీ అధినేత దీపక్ బలదేవ్ ఠాకూర్ సినిమా డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి ప్రవేశించారు. సినీ పరిశ్రమలో నటీనటులకు శిక్షణ ఇవ్వడంతో పాటు ప్రొడక్షన్, డైరెక్షన్ విభాగాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన, ప్రస్తుతం ఒడిశా, నార్త్ ఇండియా మార్కెట్‌లపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. ముంబైకి చెందిన తన మిత్రుడు రాజేష్ సింగ్‌తో కలిసి ఈ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారాన్ని ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు.

​తెలుగు, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమల్లో విస్తృతమైన పరిచయాలు ఉన్న దీపక్, గతంలో తెలుగులో సినిమా నిర్మాణంతో పాటు హిందీలో దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వర్తించారు. డిస్ట్రిబ్యూషన్‌తో పాటు ఓటీటీ, శాటిలైట్, హిందీ డబ్బింగ్ హక్కుల వ్యాపారంలోనూ ఆయన భాగస్వామ్యం వహిస్తున్నారు. అంతేకాకుండా, పాన్ ఇండియా స్థాయి చిత్రాలను నిర్మించే కొత్త నిర్మాణ సంస్థలకు బాలీవుడ్‌లోని ప్రముఖ ప్రొడక్షన్ హౌస్‌లతో టై-అప్ సాధించేందుకు అవసరమైన సేవలను అందిస్తున్నారు.

ఇప్పటికే ఒడిశా, నార్త్ ఇండియా పరిధిలో ‘మన శంకర్ వరప్రసాద్ గారు’, మహేష్ బాబు ‘దూకుడు’ రీ-రిలీజ్, అలాగే ‘లెనిన్’ చిత్రాల డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలను ఆయన విజయవంతంగా నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ‘ముఠామేస్త్రి’ చిత్రాన్ని కూడా ఆయా ప్రాంతాల్లో రీ-రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వీటితో పాటు భారీ వీఎఫ్‌ఎక్స్ (VFX) ఆధారిత చిత్రం ‘కర్మస్థలం’ను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

తాజా వార్తలు