పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాబోతున్న సినిమా ‘స్పిరిట్’. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఓ పవర్ ఫుల్ కాప్ స్టోరీగా రాబోతుంది. ఐతే, సినిమాలో ప్రభాస్ ఎంట్రీ సీన్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ ఎంట్రీ సీన్ పై ఓ న్యూస్ వినిపిస్తోంది. సెంట్రల్ జైలులో ఈ సీక్వెన్స్ ఓపెన్ అవుతుందని.. జైలులో జరిగిన అలజడి కారణంగా భారీ టెన్షన్ మొదలవుతుందని.. ఒక్కసారిగా నేరస్థులు హద్దులు దాటుతున్న క్రమంలో, పోలీసులు పారిపోతున్న క్రమంలో.. ఒక్కసారిగా సినిమాలో ప్రభాస్ పాత్ర పేరు వినపడుతుందని.. దాంతో సడెన్ గా నేరస్థుల్లో గుండె భయం మొదలయ్యేలా బిల్డ్ అయ్యేలా సీన్ డిజైన్ చేశారని టాక్.
ఆ తర్వాత ఎలాంటి హడావుడి లేకుండా ప్రభాస్ పోలీస్ లుక్లో హిందీ క్లాసికల్ సాంగ్స్ వింటూ సింపుల్ గా ఎంట్రీ ఇస్తాడట. ప్రభాస్ లో ఎలాంటి యాంగర్, అగ్రెషన్, ఇంటెన్సిటీని చూపించకపోయినా.. నేరస్థుల్లో అలా గుండె భయం ఎందుకు మొదలైంది అనే కోణంలో కథ సాగుతుందట. ఈ సినిమాలో త్రుప్తి దిమ్రిని హీరోయిన్గా నటిస్తోంది. కాగా మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని టి-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మించనున్నాయి. అన్నట్టు ‘స్పిరిట్’ మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. సందీప్ రెడ్డి వంగా నుంచి మరో వినూత్న సినిమా రాబోతుంది.


