నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌లో స్వల్ప కండరాల గాయానికి గురై ప్రస్తుతం కోలుకుంటున్నారు. మరోవైపు, జూన్‌లో అధికారికంగా ప్రారంభమైన బాలకృష్ణ-కొరటాల శివ కాంబినేషన్ ప్రాజెక్ట్‌పై ఆందోళన మొదలైంది. ఈ చిత్రం రద్దయ్యే అవకాశం ఉందంటూ వస్తున్న ప్రచారాలు ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
మొదట ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను అక్టోబరు 2026 నాటికి ప్రారంభించాలని మేకర్స్ భావించినప్పటికీ, తాజా పరిణామాలతో ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ ఈ వార్తలు నిజమైతే దర్శకుడు కొరటాల శివకు ఇది మరో పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు. ఇప్పటికే ‘దేవర 2’కి సంబంధించి అయోమయం నెలకొనగా, ఇప్పుడు బాలయ్య ప్రాజెక్ట్ కూడా ముందుకు సాగకపోతే ఆయన నెక్స్ట్ చిత్రాలపై మరింత అనుమానాలు వ్యక్తమవుతాయి.
ఎస్‌ఎల్‌వి సినిమాస్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తారని ప్రచారం జరిగింది. అయితే సినిమా రద్దుపై మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై క్లారిటీ రావాలంటే చిత్రబృందం స్పందించే వరకు వేచి చూడాల్సిందే.


