మాస్ మహారాజా రవితేజ నటించిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ‘ఇరుముడి’ ఈ శుక్రవారం గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
ముఖ్యంగా నార్త్ అమెరికా ప్రీ-సేల్స్ అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ఇప్పటికే 25K డాలర్లకి పైగా వసూలు చేసి ప్రామిసింగ్ నోట్‌తో ప్రారంభమయ్యాయి. సాధారణంగా రవితేజ సినిమాలకు నార్త్ అమెరికా అంత బలమైన మార్కెట్ కాకపోయినప్పటికీ, ఈ చిత్రంతో అక్కడ భారీ నంబర్స్ నమోదు చేస్తారని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించగా, బేబీ నక్షత్ర రవితేజ కుమార్తెగా కనిపించనుంది. సాయి కుమార్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.


