‘ఇరుముడి’ సినిమాకు ఇప్పుడు ‘టాక్సిక్’ రూపంలో పెద్ద స్పీడ్ బ్రేకర్ ఎదురుకానుంది. యశ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం బుధవారం నాడు విడుదలవుతుండగా, ఆ రోజు మీలాదునబీ, ఓనం పండుగలు కలిసిరావడం సినిమాకు కలిసొచ్చే అంశం. ఇదే ధైర్యంతో ‘టాక్సిక్’ మేకర్స్ బరిలోకి దిగుతున్నారు. తెలుగులో దిల్ రాజు, ఏషియన్ సునీల్ లాంటి బడా డిస్ట్రిబ్యూటర్లు రంగంలోకి దిగుతుండటంతో, ఏపీ, తెలంగాణలో దాదాపు 50 శాతం థియేటర్లను ‘ఇరుముడి’ కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దీనివల్ల బుధవారం లభించాల్సిన సెలవు అడ్వాంటేజ్ పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది. అయినప్పటికీ, ‘ఇరుముడి’ టీమ్ మాత్రం కాస్త ధైర్యంగానే ఉంది. ‘టాక్సిక్’ పూర్తిగా యూత్‌ను టార్గెట్ చేసే సినిమా అయితే, ‘ఇరుముడి’ మాత్రం కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఆడియన్స్ వర్గాలు వేరుగా ఉంటాయని, ఈ లెక్క వర్కౌట్ అయితే రెండు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద విజయవంతం అవుతాయని చిత్రబృందం నమ్ముతోంది. ఒకవేళ ‘టాక్సిక్’ హవా అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తే మాత్రం ‘ఇరుముడి’కి ఇబ్బందులు తప్పవు.


