కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే ‘టాక్సిక్’. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ డ్రామా పాన్ వరల్డ్ లెవెల్లో రాబోతుంది. అయితే ఈ చిత్రం కేవలం ఇంకొన్ని గంటల్లోనే థియేటర్స్ లో సందడి చేయనుంది. కానీ ఇప్పటికీ తెలుగు వెర్షన్ బుకింగ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో తెరుచుకోలేదు.
నిజానికి నిన్ననే తెరుచుకోవాల్సిన బుకింగ్స్ ఇప్పటికీ రాకపోవడంతో సినిమాకి రావాల్సిన టికెట్ ధరల హైక్ లే ప్రధాన కారణం అన్నట్టుగా తెలుస్తుంది. దీనితో థియేటర్స్ లో సినిమా కొన్ని గంటలే ఉన్నప్పటికీ ఇంకా బుకింగ్స్ తెరవకపోవడంతో యష్ సినిమా చూడాలని ఎదురు చూస్తున్న ఆడియెన్స్ లో టెన్షన్ నెలకొంది. సో టాక్సిక్ బుకింగ్స్ ఎప్పుడు మొదలవుతాయి అనేది చూడాలి. ఇక ఈ సినిమాలో కియారా, రుక్మిణి, నయన్, తారా, హుమా ఖురేషిలు నటించగా రవి బసృర్ సంగీతం అందించాడు. అలాగే కే వి ఎన్ సంస్థ నిర్మాణం వహించారు.


