మాస్ మహారాజ రవితేజ కొంచెం రూటు మార్చి థియేటర్స్ లో విడుదల చేసిన లేటెస్ట్ సినిమానే ఇరుముడి. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ ఎమోషనల్ డ్రామా విడుదల అయ్యిన మొదటి రోజే మాసివ్ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇక అక్కడ నుంచి సినిమా ఆగలేదు. దీనితో ఊహించని నెంబర్స్ ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్య పడే రీతిలో ఈ సినిమా రాబడుతుంది.
లేటెస్ట్ గా నైజాం మార్కెట్ లో అది కూడా నిన్న వర్కింగ్ డే వసూళ్లు తెలుస్తున్నాయి. సాలిడ్ బజ్ నడుమ వీకెండ్ లో విడుదల అయ్యిన ఈ సినిమాకి వర్కింగ్ డేలో రిలీజ్ రోజు వచ్చిన రేంజ్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఇది మాత్రం మామూలు బ్యాటింగ్ కాదని చెప్పాలి. పి ఆర్ నంబర్స్ ప్రకారం సుమారు 4 కోట్లకి పైగా గ్రాస్ ని ఈ సినిమా రాబట్టిందట. ఇక సాలిడ్ లాంగ్ రన్ పై కన్నేసిన ఈ సినిమా ఎక్కడ వరకు వెళ్లి అగుతుందో చూడాలి.


