గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ‘కేజీఎఫ్’ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్’ ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. ఐతే, ఈ విడుదల సందర్భంగా ప్రేక్షకులకు చిత్ర నిర్మాతలు ఒక ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ఈ సినిమా తమ సాంకేతిక నిపుణులు, కళాకారులు మరియు మొత్తం చిత్ర బృందం యొక్క సంవత్సరాల కృషి ఫలితమని పేర్కొంటూ, దయచేసి చిత్రంలోని సన్నివేశాలను రికార్డ్ చేయవద్దని, ఆన్లైన్లో పంచుకోవద్దని చిత్ర బృందం అభిమానులను కోరింది.
భారీ బడ్జెట్తో తెరకెక్కిన ‘టాక్సిక్’ బహుళ భాషల్లో విడుదలవుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి పది రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతిని ఇచ్చాయి. ఈ సినిమాలో కియారా అద్వానీ, నయనతార, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి, తారా సుతారియా తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ మరియు మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ నిర్మించగా, రవి బస్రూర్ సంగీతాన్ని అందించారు.


