నార్త్ లో రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ తో ‘టాక్సిక్’.. అఫీషియల్ గా యశ్ బిగ్గెస్ట్ స్టార్స్ లిస్ట్ లో

నార్త్ లో రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ తో ‘టాక్సిక్’.. అఫీషియల్ గా యశ్ బిగ్గెస్ట్ స్టార్స్ లిస్ట్ లో

Published on Aug 27, 2026 3:53 PM IST

లేటెస్ట్ గా పాన్ ఇండియా మార్కెట్ లో ఊహించని బుకింగ్స్ తో ట్రేడ్ కి షాకిచ్చిన సినిమానే ‘టాక్సిక్’. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన ఈ భారీ సినిమా పెర్ఫామెన్స్ అంతా ఎక్కువ హిందీ మార్కెట్ ఎలా ఉంటుంది అనే దానిపైనే దృష్టి ఉంది. అయితే విడుదలకి ముందే హిందీలో మాసివ్ బుకింగ్స్ ఈ చిత్రానికి జరిగాయి.

అంతే కాకుండా మొదటి రోజు కేవలం నార్త్ మార్కెట్ నుంచే ఏకంగా 50 కోట్లకి పైగా నెట్ వసూళ్లు రావచ్చనే అంచనా కూడా ఉంది. ఇప్పుడు సీన్ కట్ చేస్తే అనుకున్నట్టు గానే టాక్సిక్ చిత్రం ఏకంగా 55 కోట్లకి పైగా నెట్ వసూళ్లతో ఈ ఏడాదిలో బిగ్గెస్ట్ ఓపెనర్స్ లో రెండో స్థానంలో నిలిచి షాకిచ్చింది. పైగా తన కే జి యఫ్ 2 ఓపెనింగ్స్ కూడా ఇది బ్రేక్ చేసింది.

దీనితో ఇండియన్ సినిమా మార్కెట్ దగ్గర సోలోగా యశ్ పాన్ ఇండియా మార్కెట్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన హీరోగా నిలిచాడు అని చెప్పాలి. ఇది మాత్రం తనకి డెఫినెట్ గా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పవచ్చు. ఎలాంటి సీక్వెల్ బజ్ లేకుండా హిందీ మార్కెట్ లో ఈ రేంజ్ ఓపెనింగ్స్ కేవలం యశ్ కే చెల్లింది అని చెప్పవచ్చు. ఇక ముందు రోజుల్లో వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి.

తాజా వార్తలు