ట్రిపుల్ ట్రీట్మెంట్ అంటున్న ఐకాన్ స్టార్.. ఆడియన్స్ ఆమోదించేనా..?

ట్రిపుల్ ట్రీట్మెంట్ అంటున్న ఐకాన్ స్టార్.. ఆడియన్స్ ఆమోదించేనా..?

Published on Aug 29, 2026 1:01 AM IST

Allu-Arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ ‘రాకా’ షూటింగ్ తుది దశకు చేరుకుంది. లీక్స్‌కు తావు లేకుండా అత్యంత గోప్యంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి.

ఈ చిత్రంలో అల్లు అర్జున్ తండ్రిగా, ఇద్దరు కొడుకులుగా ఏకంగా ట్రిపుల్ రోల్‌లో అలరించబోతున్నట్లు సమాచారం. అందులో ఒక పాత్ర నెగెటివ్ షేడ్స్‌తో ఉండనుందని ప్రచారం జరుగుతోంది. అయితే, అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్స్ చేస్తే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.

సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ పాన్-ఇండియన్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌కు సంబంధించి త్వరలోనే మేకర్స్ నుంచి అధికారిక అప్‌డేట్స్ రానున్నాయి.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు